telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతి సందర్భంగా సీటీమార్‌ సర్‌ఫ్రైజ్‌

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం` సీటీమార్‌`. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు మకర సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ నూతన పోస్టర్‌ విడుదల చేసి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇందులో గోపీచంద్ హీరోగా చేస్తున్నాడు. అంతేకాకుండా మిల్కీ బ్యూటీ తమన్నా జ్వాలా రెడ్డి అనే పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాని సంపత్ నంది దర్శకత్వంతో రూపొందింది. నిజానికి ఈ సినిమా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా విడుదలను వాయిదా వేవారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. కానీ అది ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. బహుశా ఈ సినిమా కూడా వేసవి రేసులో పాల్తొంటుందేమే అని అంటున్నారు. దీనపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

Related posts