telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ట్వీట్ కు స్పందించిన కంగనా రనౌత్

kangana

సినిమా ఇండస్ట్రీలోని ప్రతీ నటుడూ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీలో పనిచేయాలని కోరుకుంటారు. అయితే, పీసీ శ్రీరామ్ మంగళవారం ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న సినిమాను చేయడానికి తాను తిరష్కరించానని శ్రీరామ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న సినిమాకు పనిచేయడానికి నేను అంగీకరించలేదు. లోతుగా ఆలోచించాక నాకు ఇబ్బందిగా అనిపించింది. నా కారణాలను మేకర్స్‌కి వివరించాను. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు మన మనసుకి ఏది ఒప్పు అనిపిస్తే అదే చేయాలి. వాళ్లకు నా శుభాకాంక్షలు’’ అని పీసీ శ్రీరామ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. పీసీ శ్రీరామ్ ట్వీట్ చేసిన కొంత సేపటికి కంగనా రనౌత్ స్పందించారు. పీసీ ట్వీట్‌కు చాలా కూల్‌గా రిప్లై ఇచ్చారు. పీసీ శ్రీరామ్ లాంటి దిగ్గజ సినిమాటోగ్రాఫర్‌తో పనిచేసే తాను కోల్పోయానని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘మీలాంటి దిగ్గజంతో పనిచేసే అవకాశాన్ని నేను కోల్పోయాను సార్. ఇది నాకు పెద్ద లోటు. నా వల్ల మీకు ఏ విధంగా ఇబ్బంది కలిగిందో నాకు తెలీదు. కానీ, మీరు తీసుకున్న సరైన నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. మీకు అంతా మంచే జరగాలి’’ అని కంగన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, వివాదాలకు మారుపేరుగా మారిన కంగనా రనౌత్ ఇంత సాఫ్ట్‌గా శ్రీరామ్‌కు రిప్లై ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.
 

Related posts