telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియాకు బెయిల్ నిరాకరించిన కోర్ట్ …

Rhea

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరోవైపు సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో రియాను నిందితురాలుగా చేర్చి విచారణ జరుపుతున్నారు. అయితే రియా బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు రియాకు బెయిల్ నిరాకరించి 14రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. కాగా సుశాంత్ ఆత్మహత్యకు అతడి ప్రేయసి రియా చక్రవర్తితో పాటు సుశాంత్ స్నేహితులు కారణమయ్యారంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపించడంతో అదికారులు ఆ దిశగా విచారణ జరిపారు. అయితే రియా ఆమె సోదరుడు కలిసి సుశాంత్ కు డ్రగ్స్ ఇవ్వడంపై సంబాషించుకున్న వాట్సప్ చాట్ వైరల్ అవ్వడంతో అధికారులు ఆ దిశగా విచారణ జరిపారు. దాంతో రంగంలోకి దిగిన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మొదట రియా సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. రియా సోదరుడి విచారణ తరవాత రియా సైతం డ్రగ్స్ సరఫరా చేసిందని తేలడంతో ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

Related posts