telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వ్యాక్సినేషన్ పై కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం

Corona Virus Vaccine

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 3 రోజులలో 1.4 లక్షల మందికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, హైరిస్క్ గ్రూపులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైనదని ప్రధాన కార్యదర్శి తెలిపారు.

జి.హెచ్.యం.సి లో 32 సెంటర్లు ఏర్పాటు చేశామని , వారం రోజుల పాటు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, ప్రతి రోజు 30 వేల మందికి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఉదయం పబ్లిక్ గార్డెన్ కు ఎదురుగా ఉన్న రెడ్ రోస్ function hall లో హై రిస్క్ మరియు హైఎక్స్ పొజర్ ఉన్న ప్రజలకు మొదటి విడత వ్యాక్సినేషన్ ఇస్తున్న కేంద్రాన్నితనిఖి చేశారు.

ఈ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఉదయం 8 నుండి ప్రారంభమవుతుందని అధికారులు గుర్తించి కూపన్లు జారిచేసిన వీధి వ్యాపారులు, కిరాణాషాపులు, పెస్టిసైడ్ షాపులలో పనిచేస్తున్న కార్మికులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే ప్రజలకు జి.హెచ్.యం.సి అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ప్రజలు తమకు వ్యాక్సినేషన్ సదుపాయన్ని ఎర్పరచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. తదనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు.

Related posts