telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆంధ్రుల..అవకాయ… ఎంతో మధురమే

ఆవకాయ ఆంధ్రుల ఊరగాయ

అది లేకుంటే ఇల్లు చిన్నబోయె

దాని సాటి ఇంకొకటి పుట్ట లేదాయే

అందుకే ఆ రుచికి బానిస లై పోయే

 

పుల్లని మామిడి ముక్కలు, ఎఱ్ఱని కారం

ఘటై న ఆవపిండి..కమ్మని పప్పు నూనె

ఉప్పు…మెంతులు/శనగలు… మేళ విస్తే

మేటి ఆధరువై….నోరు ఊరి పోయే.

 

వేడి అన్నంలో నెయ్యి,పప్పు..ఆవకాయ

తో కలిపినా… చల్ల న్నం లో ఘాటుగా కలిపి ఊరినాక తిన్నా…

.పెరుగు అన్నం లో ముక్క నంచినా…

అదిరిన ఆ గొప్ప రుచి తో 

తిని చూస్తే… ఆహా…జన్మమే ధన్య మాయే…అణువణువు పరవశ మాయే

 

అమ్మ ప్రేమామృత మమకారం,

ఆవకాయ అమోఘ రుచి వైనం……

వర్ణింప నాలుగు తలల బ్రహ్మ తరమా

ఆస్వాదించ కుంటే….ఆ బ్రతుకే…ఇక

వ్యర్థమా

 

హడావుడి/తొందర లో..వేరే ఆధరువు లేకుంటే

పెద్ద దిక్కై ఆదుకునే అవ కాయ మాతను

మరువగలమా…..ఫలహారాలు,అన్నం లో సదా తోడు ఉండే అపురూపాన్ని…

అపూర్వం గాదాచుకుని..వాడటం …

 మాను కో గలమా

 

ఎంత తిన్నా తనివి తీరని ఆవకాయ

కడుపు పట్టక కానీ… ఐనాతగ్గని ఆరాటం

రుచికి లొంగీ…స్వర్గం అని ఊగటం

విస్తరిలో ఎన్నున్నా..ఆవకాయ కై వెతకటం

తిని ఆత్మారాముని సంతృప్తి పరచటం

ఆవకాయ తో సహ జీవనం….కాదా మనో జ్ఞం…మరువ రాని ప్రియ బంధం

 

తరా ల సంస్కృతి,సంప్రదాయం మారినా

ఆవకాయ తయారీ/సేవనం…అదే రీతి

మారని పద్ధతి…నిరంతర పేరు..ప్రఖ్యాతి

విదేశాల్లోనూ చేరి….పెంచుతున్న ఖ్యాతి

 

పుడితే ఆంధ్ర దేశం లోనే పుట్టాలి

ఆవకాయ సేవనం లో ధన్యులమై

 దాని వాడుకలో…ఆహా..ఓహో..అంటూ

 ఆ రుచికి దాసులమై మురిసి పోవాలి

ఆవకాయ బంధ…అనన్యం…అద్భుతం.

Related posts