telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఇతర జబ్బుల మందులు వాడే వారు.. వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఎలాంటి సమస్యలు ఉంటాయి!

కరోనా భయంతో ఇంట్లో పలు చిట్కాలు పాటిస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అతిగా వేడి నీళ్లు తాగడం, అతిగా ఆవిరి పట్టడం.. మరిన్ని సమస్యలకు కారణమవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం దీర్ఘకాలిక మందుల వాడకం మానివేయడం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. 

కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సమాజంలో #ఎలాంటి_అపోహలు_నెలకొన్నాయి?

వ్యాక్సిన్‌ వేసుకున్నాక ఎలాంటి ట్యాబ్లెట్లు వాడొద్దు అనే అపోహ వీడాలి. టీకా వేసుకున్నాక చాలా మంది.. వారు వాడుతున్న షుగర్‌, బీపీ మాత్రలు కూడా వేసుకోవడం లేదు. ఎవరో చెప్తే వారు ఇలా చేస్తున్నారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించొద్దు. వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజుల తర్వాత వారు ఎప్పుడూ వాడే మందులు వాడుకోవాలి. కొన్ని పెయిన్‌ కిల్లర్లను మాత్రమే వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని వేసుకోకుండా ఉంటే చాలు. టీకా తీసుకున్న చాలా మందికి కొన్ని గంటల తర్వాత జ్వరం వస్తోంది. ఒకటి, రెండు రోజుల వరకు మాత్రమే ఈ జ్వరం ఉండే అవకాశం ఉంటుంది. మూడు లేదా అంతకుమించి రోజులు జ్వరం, నీరసం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉంటే అవి వ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల కాదు అనే విషయాన్ని గుర్తించాలి. వాటిని కరోనా లక్షణాలుగా భావించి టెస్టు చేయించుకోవాలి.

#జ్వరం_ఇతరత్రా_ఆరోగ్య_సమస్యలుంటే_వ్యాక్సిన్‌_వేసుకోవచ్చా?

#కొవిడ్‌_సోకితే_ఎన్నిరోజులకు_టీకా_తీసుకోవాలి?

           జ్వరం, ఇతరత్రా లక్షణాలు ఏమీ లేనప్పుడే వ్యాక్సిన్‌ వేసుకోవాలి. కరోనా సోకి ఉంటే అది తగ్గిన 8 వారాల తర్వాత మాత్రమే టీకా తీసుకోవాలి. మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత కొవిడ్ బారిన పడితే.. పూర్తిగా కోలుకున్న అనంతరం రెండు వారాల తర్వాత మాత్రమే రెండో డోసు తీసుకోవాలి.

 

#పిల్లలకు_కొవిడ్‌_సోకిన_తల్లులు_పాలు_ఇవ్వొచ్చా?

#ఒకవేళ_ఇస్తే_ఎలాంటి_జాగ్రత్తలు_వహించాలి?

 

             కొవిడ్‌ సోకిన తల్లులు అన్ని నిబంధనలు పాటిస్తూ తమ పిల్లలకు పాలు అవ్వొచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు.

 

ఆవిరి పట్టడంపై కూడా చాలా మందిలో అపోహలు ఉన్నాయి. రోజుకు ఎన్నిసార్లు, ఏ సమయంలో ఆవిరి పట్టొచ్చు? 

ముక్కు దిబ్బడగా ఉండి.. నోటి ద్వారా శ్వాస తీసుకునే పరిస్థితి ఉంటే రెండు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఆవిరి పట్టొచ్చు. నెలల తరబడి అలా చేయకూడదు. అలా చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వేడి నీరు తాగడంపై కూడా అపోహలున్నాయి. నెలల తరబడి వేడి నీళ్లు తాగితే అల్సర్లు ఏర్పడే అవకాశం ఉంది. ఆయాసం, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ రోజులు, ఎక్కువ వేడి నీరు తాగితే అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Related posts