telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిహీకా మెహందీ ఫంక్షన్ లో మెరిసిన సమంత… పిక్స్ వైరల్

Samantha

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ రోజే (ఆగస్టు 8) రానా- మిహికా వివాహ వేడుక జరగనుంది. అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్న ఘనంగా జరగనున్న ఈ వేడుకకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. మరోవైపు పెళ్లికి మూడు రోజుల ముందే (బుధవారం) ప్రారంభమైన ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో అటు రానా ఇంట, ఇటు రానాకు కాబోయే భార్య మిహికా బజాజ్ ఇంట సందడి వాతావరణం నెలకొంది. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, పెళ్లి కొడుకును చేయడం లాంటి కార్యక్రమాలతో ఇరు కుటుంబాలు బిజీ అయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి పెళ్లి వేడుకలు ఊపందుకొన్నాయి. శుక్రవారం రాత్రి రానా-మిహీకా సంగీత్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు కూడా పాల్గొని సందడి చేశారట. గురువారం మిహీకా మెహందీ ఫంక్షన్ జరిగింది.

జూబ్లీహిల్స్‌లోని బజాజ్ నివాసంలో జరిగిన మిహీకా మెహందీ ఫంక్షన్‌లో అక్కినేనివారి కోడలు సమంత పాల్గొని సందడి చేశారు. కాబోయే పెళ్లికూతరు మిహీకాతో పాటు సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మిహీకా లేత గులాబీ వర్ణం జాకెట్ లెహెంగాలో మెరవగా.. సమంత పైనాపిల్ ఎల్లో వింటేజ్ గార్డెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్‌లో జిగేల్‌మనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వైరల్ ఫొటోల్లో రానా, సమంత కలిసి ఉన్న ఫొటోలు కూడా హల్చల్ చేస్తున్నాయి.

Related posts