telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ : సోము వీర్రాజు

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పవన్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌ను సీఎంగా చూడటమే తమ లక్ష్యమని.. ఇది తన ఒక్కడి మాటే కాదని… ప్రధాని మోడీ, అమిత్‌ షా చెప్పిన మాటలని తెలిపారు. అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిందిగా మోడీ, షా చెప్పారని గుర్తు చేశారు. కచ్చితంగా పవన్‌ ఏపీకి అధినేతగా చూస్తారని స్పష్టం చేశారు సోము వీర్రాజు. బీజేపీ, జనసేన కార్యకర్తలు ఈ అంశాన్ని ట్రూ స్పిరిట్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే.. పవన్‌ పై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తిరుపతి అభ్యర్థి విషయంలో రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంఓ పవన్‌ కళ్యాణ్‌ను సీఎం చేస్తామంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

Related posts