telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ సింగ్ కేసు : కీలక వ్యక్తి అరెస్ట్

Sushanth

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది.. అయితే ఇది ఆత్మహత్య కేసు అని ముంబై పోలీసులు చెప్పినప్పటికీ, ఇది హత్య అని సుశాంత్ కుటుంబంతో పాటుగా పలువురు అన్నారు. అంతేకాకుండా ముంబై పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని డిమాండ్ చేయడంతో ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి వెల్లడించింది. అనంతరం ఈ కేసులో అనేక మలుపులు తిరిగింది. తాజాగా సుశాంత్‌ కేసులో సిద్ధార్థ పితాని అరెస్ట్‌ అయ్యాడు. హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్‌ చేసి ముంబైకి తరలించింది ఎన్సీబీ. సుశాంత్‌ ప్లాట్‌లో మూడేళ్లపాటు ఉన్న సిద్ధార్థ్‌.. డ్రగ్స్‌ కేసులో సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించింది ఎన్సీబీ. ఆత్మహత్యకు ముందు చివరి సారి సిద్ధార్థ్‌తో మాట్లాడారు సుశాంత్‌. సుశాంత్‌కు పీఆర్‌ మేనేజర్‌గా కూడా సిద్ధార్థ్ పనిచేశారు. సిద్ధార్థ్ పితానిని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న ముంబై NCB అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుశాంత్‌ కేసులో విచారణ కోసం తన కొడుకును ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది సిద్ధార్థ్ తల్లి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts