telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యతో “గరుడ వేగ” దర్శకుడి సినిమా ?

NBK

కింగ్ నాగార్జున ఇప్పుడు అహిషోర్ సోలోమెన్ ద‌ర్శక‌త్వంలో ‘వైల్డ్ డాగ్‌’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ప్రవీణ్ సత్తారు “గరుడ వేగ” వంటి సూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత తన రెండో సినిమాకు చాలానే సమయం పట్టింది. అందువల్ల తన రెండో సినిమాకు తీసుకునంత గ్యాప్ మూడో సినిమాకు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడట. అందుకే నాగార్జునతో సినిమా పూర్తయిన వెంటనే నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయనున్నాడట. ఇప్పటికే బాలయ్యతో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను బాలయ్య కమర్షియల్ ఫార్ములాకు విరుద్ధంగా పూర్తి వైవిధ్యమైన కథతో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్నాడట.

Related posts