telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ కమెడియన్ సునీల్‌ కు అస్వస్థత

sunil back as star comedian

ప్రముఖ కమెడియన్, హీరో సునీల్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి ఆయన హుటా హుటిన గచ్చిబౌలి లోని ఏఐజీ హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. సునీల్‌ని పరీక్షించిన డాక్టర్స్ ఆయనకు యాంటిబయోటిక్ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో సునీల్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాత్రి నుండి వైద్యం అందించడంతో సునీల్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని ప్రమాదం ఏమీ లేనట్లు తెలస్తోంది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఎక్కువగా యాంటిబయోటిక్ మాత్రలు వేసుకోవడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చింది. కాగా సునీల్, రవితేజ ‘డిస్కో రాజా’లో కీలకపాత్ర పోషించారు. గత ఆదివారం నాడు జరిగిన ‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సునీల్ తన ప్రసంగంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రేపు (శుక్రవారం) కానుండగా.. అనారోగ్యంగా కారణంగా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారు సునీల్.

Related posts