వెస్టిండీస్ పై ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ 22 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. ఒక ఏడాదిలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన ఓపెనర్‌గా సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో కటక్ వేదికగా నిర్వహించిన మూడో వన్డేలో ఈ రికార్డును అందుకున్నాడు. రికార్డుకు 9 పరుగులు దూరంలో నిలిచిన ఈ హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును తిరగరాశాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 63 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రోహిత్ అధిగమించకపోయి ఉంటే జయసూర్య పేరిట రికార్డు అలాగే ఉండిపోయేది. ఎందుకంటే ఈ ఏడాదికి టీమ్‌ఇండియా ఆడబోయే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
1997లో జయసూర్య టెస్టులు, వన్డేల్లో కలిపి 2387 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. తర్వాత ఏ ఓపెనర్ దాన్ని అధిగమించలేకపోయాడు. అయితే మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న రోహిత్‌కు 22 ఏళ్ల తర్వాత ఆ రికార్డును చెరిపేయడం సాధ్యమైంది. రోహిత్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన వారిలో వెస్టిండీస్ ఓపెనర్ షై హోప్ (1303), కోహ్లి (1292) ఉన్నారు.
చిదంబరం కేసులకు ఆధారాలు: నితిన్ గడ్కరీ