telugu navyamedia
Uncategorized క్రీడలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని .. స్విమ్మింగ్ కోచ్ సురాజిత్ గంగూలీపై వేటు ..

swimming coach ganguly out on girl abusing

స్విమ్మింగ్ కోచ్ సురాజిత్ గంగూలీ తన వద్ద కోచింగ్ కోసం వచ్చిన 15 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. దీనితో అతనిపై వేటు పడింది. గోవాకు చెందిన సురాజిత్ 15 ఏళ్ల బాలికను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించిన ఓ వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్యాగ్ చేస్తూ వినోద్ కాప్రి అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. వెంటనే కేంద్ర మంత్రి ఈ ఘటనపై స్పందించారు.

సంబంధిత స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వెంటనే కఠన చర్యలు తీసుకుంటాం. ఇది చాలా దారుణమైన నేరం. ఆ కోచ్‌పై వెంటనే కఠినమైన యాక్షన్ తీసుకోవాలని పోలీసులను నేను కోరుతున్నాను.. అని రిజిజు ట్వీట్ చేశారు. నేను దీనిపై విచారణ జరిపాను. సురాజిత్ గంగూలీ కాంట్రాక్ట్‌ను గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ ఇప్పటికే రద్దు చేసింది. అతనికి భారతదేశంలో ఎక్కడ ఉద్యోగం రాకుండా చేయాలని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను నేను కోరుతున్నాను. ఇది ప్రతి ఫెడరేషన్, డిసిప్లిన్లకు వర్తిస్తుంది.. అని మరో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

Related posts