విశాఖలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం ఘటనపై పోలీసులు నూతన్ కుమార్ నాయుడు భార్యతో సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడికి శిరోముండనం ఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దళిత నేతలు నిర్వహించిన ఆందోళనతో రాకపోకలకు అంతరాయమేర్పడింది.
నూతన్ నాయుడి భార్య మరికొందరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాలు, వామపక్ష నాయకులు విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మొబైల్ దొంగిలించాడనే ఆరోపణతో శిరోముండనం చేయించిన నూతన్ నాయుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నూతన్ నాయుడికి స్థానిక ఎమ్మెల్యే అండ ఉందని అనతున్నారు. అందుకే ఆయనను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.
గెలుస్తున్నారంటే అమ్మవార్ల దయే: జేసీ