telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ వాసు లైంగికంగా వేధించలేదు : జూనియర్ ఆర్టిస్ట్ సునీత

Sunitha

ఆర్టిస్ట్ సునీత బోయ గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాత తనను మోసం చేశాడని పేర్కొంటూ తీవ్ర ఆందోళన చేసింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌ వద్ద సునీత సదరు నిర్మాతపై ఆరోపణలు గుప్పించడంతో ఫిలిం ఛాంబర్‌ పరిసర ప్రాంతాలన్నీ ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే తాజాగా ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో మాత్రం బన్నీ వాసుపై అటువంటి తప్పుడు (లైంగిక వేధింపులు) ప్రచారం చేయవద్దంటూ కోరారు. ఆమె మాట్లాడుతూ “జనసేన పార్టీలో కీలకంగా ఉన్న సమయంలో నేను నిర్మాత బన్నీ వాసుగారిని ఒకటి రెండు సార్లు స్వయంగా కలిశాను. ఆ తర్వాత బన్నీ వాసుగారిని కలవడానికి ప్రయత్నించినప్పటకీ ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఆయన్ని కలవడానికే నేను నిరసన తెలియజేస్తున్నాను. బన్నీ వాసుగారిపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. బన్నీ వాసుగారు నన్ను లైంగికంగా వేధించారని వస్తున్న వార్తల్లో నిజంలేదు. నేను ఎక్కడా అలా చెప్పలేదు. దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దు. అవాస్తవ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను” అంటూ ఆర్టిస్ట్ సునీత బోయ ఈ వీడియోలో తెలిపారు.

Related posts