telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తాండవ్ వెబ్ సిరీస్‌ పై యూపీ ప్రభుత్వం సీరియస్…

అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతున్న తాండవ్ వెబ్ సిరీస్‌లో హిందీ దేవుళ్లను కించపరిచే విధమైన సన్నివేశాలు ఉన్నాయని ముంబై, లక్నోలలో దీనిపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కారణంగా అమెజాన్ మరోమారు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయతే ఈ విషయంలో ఎవరని క్షమించమని, అందరిపై చర్చలు తీసుకుంటామని యూపీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా తాండవ్ వెబ్ సిరీస్ నటీనటులు, దర్శకుడు, నిర్మాతలపై కఠిన చర్చలు తప్పవని హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు వారికి శిక్ష తప్పదని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పష్టం చేశారు. హిందువుల దేవుళ్లను కించపరిచి వారి మనోభావాలను దెబ్బతీసి తాండవ్ నిర్మాత, దర్శకుడు, నటులు నేరం చేశారని, అందుచేత వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ కేశమ్ ప్రసాద్ మౌర్య ట్వీట్ చేశారు. ఇప్పటికే తాందవ్‌పై యూపీ, మధ్యప్రదేశ్‌లో కొన్ని కేసులు నమోదయ్యాయి. దాంతో హజ్రత్‌గంజ్‌కు చెందిన కొందరు పోలీసులు విచారణ నిమిత్తం ముంబై బయలుదెరారు. అయితే ఇప్పటికే తాండవ్ మేకర్స్ క్షమాపణలు కోరారు. తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని వారు ప్రకటించారు. మరి ఇప్పుడైనా వారు తన కేసును వెనక్కి తీసుకుంటారా… లేదా అనేది చూడాలి.

Related posts