telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

స్కూళ్లు వద్దని ఆన్ లైన్ లో పిటిషన్!

half day schools in AP since high temp

కరోన వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు జంకుతున్నారు. జూలై 1 నుంచి దశలవారీగా పాఠశాలలను తెరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గేంతవరకూ లేదా వాక్సిన్ వచ్చే వరకూ స్కూళ్లు వద్దని ‘పేరెంట్స్ అసోసియేషన్’ అనే బృందం ఓ ఆన్ లైన్ పిటిషన్ పోస్ట్ చేసింది. ఈ పిటిషన్ ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల విషయంలో వెనక్కు తగ్గేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

నిప్పుతో చెలగాటం వద్దంటూ సాగే పిటిషన్ పై ఇప్పటికే ఐదున్నర లక్షల మందికి పైగా తల్లిదండ్రులు సంతకాలు చేశారు. జూలైలో స్కూళ్లను ఓపెన్ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మాత్రమూ సరికాదని అంటున్నారు. పిల్లల భద్రతకు హామీ ఎవరిస్తారని అడుగుతున్న తల్లిదండ్రులు, ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ఈ-లెర్నింగ్ విధానంలో కొనసాగించాలని, వర్చువల్ లెర్నింగ్ ను ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నారు. భౌతిక దూరం, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నా, అవి కరోనా నుంచి తమ బిడ్డలను కాపడలేవని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts