telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ తో పొత్తుపై క్లారీటి ఇచ్చిన చంద్రబాబు

Chandrababu give Clarity Congress Aliance

ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తుపై సీఎం చంద్రబాబు క్లారీటి ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు రాజకీయ అనివార్యత వల్ల పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. దేశాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో బీజేపీకి వ్యతిరేక పార్టీలను కలుపుకుపోతున్నామని అందులో భాగంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే, జాతీయ స్థాయిలో అందరం కలిసే ముందుకెళ్తామన్నారు.

ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీయేతర నేతల సమావేశంలో ఈవీఎంలపై చర్చించినట్లు తెలిపారు. ప్రజస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే అంశం పై చర్చించామన్నారు. ఈవీఎంల వల్ల ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 4 న కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts