telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరోపై కోపంతో ఏకంగా భార్యను చంపిన భర్త… ఏం జరిగిందంటే ?

Hrithik-Roshan

స్టార్ హీరోపై కోపంతో కట్టుకున్న భార్యనే భర్త దారుణంగా చంపేసిన ఘటన వైరల్ అవుతోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన డోజోయ్ అనే మహిళకు హృతిక్ అంటే ప్రాణం. ఆమె దినేశ్వర్ అనే ఇండియన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అతని ద్వారా డోజోయ్‌కి హృతిక్ గురించి తెలిసింది. న్యూయార్క్‌లోని జెమిలి అల్ట్రా లోంజ్‌లో డోజోయ్ బార్టెండర్‌గా పని చేస్తుండేది. శుక్రవారం రాత్రి డోజోయ్ టీవీ చూస్తుంటే భర్త దినేశ్వర్ ఆమెను కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత డోజోయ్‌ను చంపేశానని తన సోదరికి ఫోన్ చేసి చెప్పి పరారయ్యాడు. వెంటనే దినేశ్వర్ సోదరి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి చూడగా డోజోయ్ రక్తపు మడుగుల్లో కనిపించింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ మొదలుపెట్టిన పోలీసులు డోజోయ్ పనిచేస్తున్న రెస్టారెంట్‌కు వెళ్లి ఆమె కొలీగ్స్‌ను విచారించారు. డోజోయ్ స్నేహితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ‘దినేశ్వర్‌కు డోజోయ్ అంటే చాలా ఇష్టం. ఆమె పట్ల కాస్త అసూయ కూడా అతనికి ఉంది. ఎందుకంటే డోజోయ్ చూడటానికి అందంగా ఉంటుంది. అతని కంటే ఎక్కువ సంపాదిస్తోంది. దాంతో అసూయ చెందిన దినేశ్వర్.. డోజోయ్‌ని ఎప్పుడూ కొడుతుండేవాడు. చాలా సార్లు చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు.. డోజోయ్‌కి హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. అతని సినిమాలు చూసినా, పాటలు విన్నా దినేశ్వర్‌కు చాలా కోపం వచ్చేది. ఛానెల్ మార్చాలని హింసించేవాడు. బహుశా అందుకే డోజోయ్‌ని చంపేసి ఉంటాడని మాకు అనిపిస్తోంది’ అని తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడు దినేశ్వర్‌ను అదుపులోకి తీసుకోవాలని అనుకున్నారు. కానీ భార్యను చంపిన తర్వాత ఎక్కడిడో పారిపోయిన దినేశ్వర్ ఓ పొలంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

Related posts