telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాతో విడిపోయాక చాలా సంతోషం‍గా ఉన్నాను

kangana

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌, అధ్యాయన్‌ సుమన్‌ బ్రేకప్‌ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సమన్‌ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషం‍గా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమన్‌ దీనిపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘కంగనాతో విడిపోయే సయంలో తనకు ఎవరూ మద్దతుగా లేరు. అప్పుడు నేను కఠిన పరిస్థితులను చుశాను. తను నన్ను నా కుటుంబాన్ని చాలా బాధపెట్టింది. ఆమెతో విడిపోయాక నా జీవితం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు జీవితంలో చాలా ముందుకు వెళ్లాను. అప్పుడు నేను ఎదుర్కొన్న విమర్శలకు కారణమైనవారు నాకు క్షమాపణలు చెప్పారా లేదా అన్నది నాకు అవసరం లేదు అని సమన్‌ వెల్లడించాడు. కాగా ‘రాజ్: ది మిస్టరీ కంటీన్యూస్’‌ సినిమా షూటింగ్‌లో సుమన్‌, కంగనాలు ప్రేమలో పడ్డారు. కంగనాతో విడిపోయే సమయంలో ఆమె తనపై తీవ్ర విమర్శలు చేశారని అంతేగాక తనకు చేతబడి కూడా చేయించిందంటూ చేసిన సుమన్‌ వ్యాఖ్యలు అప్పట్లో విపరితంగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

Related posts