తెలంగాణలో స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,799 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలో కూడా సత్తా చాటుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తన భార్య లక్ష్మీ ఎమ్మెల్సీగా గెలుస్తుందని ఆయన అన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ది చెప్పినట్టు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీ హీనంగా చూస్తోందన్నారు. సర్పంచ్ లకు ఇంతవరకు చెక్ పవర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.