telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వెలిగొండ ప్రాజెక్ట్ కు … రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ …

another reverse trading on veligonda

ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ రివర్స్ టెండరింగ్ కి నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో ఇదే పనులకు ఎంపీ సీఎం రమేష్ కి చెందిన రుత్విక్ సంస్థకు గత ప్రభుత్వం టెండర్లు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పనుల నుంచి రుత్విక్ ని తప్పించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తోంది. నిపుణుల కమిటీ సూచన మేరకు.. వెలిగొండ పనులకు.. తాజాగా 553.13 కోట్ల అంచనా వ్యయంతో జలవనరుల శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. గతంలో ఇదే పనులకు ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రుత్విక్ సంస్థకు గత ప్రభుత్వం టెండర్లు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ పనుల నుంచి రుత్విక్ ని తప్పించిన ఏపీ ప్రభుత్వం పోలవరం 65వ ప్యాకేజీకి రివర్స్ టెండరింగ్ వెళ్లిన విధంగా.. వెలిగొండ ప్రాజెక్ట్ పనులలోనూ రివర్స్ టెండరింగ్ విధానానికి నోటిఫికేషన్ జారీచేసింది.

తాజా రివర్స్ టెండరింగ్‌తో దాదాపు రూ.58 కోట్లు ఆదా చేశామని, రివర్స్ టెండరింగ్‌తోనే ఇది సాధ్యమైందని చెబుతోంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం అడ్డు చెప్పినా, హైకోర్టులో పిటిషన్ లు వేసినా దూకుడుగా ముందుకు అడుగులు వేయడంతోనే ఇది సాధ్యమైందని అంటోంది. ఇదే ఊపులో వెలిగొండ ప్రాజెక్ట్ కు రివర్స్ టెండర్లకు వెళ్లింది. ఏకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. రేపటి నుంచి బిడ్‌ల స్వీకరణ.. బిడ్‌ల దాఖలుకు తుది గడువును అక్టోబర్ 9గా నిర్ణయించారు. వచ్చే నెల 11న బిడ్.. అదే రోజు రివర్స్ ఈ-ఆక్షన్ ప్రక్రియ చేపడతామని నోటిఫికేషన్‌లో తెలియజేశారు.

Related posts