telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇంటి సమీపంలో పాము

cp sajjanar on disa accused encounter

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఇంటి సమీపంలో ఓ పాము కలకలం రేపింది. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే, పాముకు ఎలాంటి అపకారం తలపెట్టకుండా హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వెంకట్ నాయక్‌ అనే కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు.

వెంటనే సీపీ ఇంటివద్దకు చేరుకున్న వెంకట్ చాకచక్యంగా పామును ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పామును జూపార్క్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా వెంకట్ నాయక్‌ను సీపీ అభినందించారు. వెంకట్ నాయక్‌ పాములను పట్టడంలో ఆరితేరినవాడు.

Related posts