శబరిమల ఆలయంలోకి మహిళ భక్తుల ప్రవేశంపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. గతంలో సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. మహిళ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇవ్వొద్దని దాఖలైన పిటిషన్లపై స్టే విధిస్తూ.. పిటిషన్లను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేసింది. సుప్రీకోర్టు తీర్పుపై తమకు మరింత స్పష్టత కావాలని పినరయి విజయన్ అన్నారు. ఆలయంలోని మహిళల ప్రవేశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన అంశాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. శబరిమల ఆలయంలోకి మహిళ భక్తుల ప్రవేశంపై 3:2 న్యాయమూర్తులు విభేదించడంతో యధాతధాస్థితిని కొనసాగించారు. ఆయా పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మసనానికి బదిలీ చేశారు.
ప్రభుత్వానికి కోర్టు తీర్పుపై క్లారిటీ ఉందని.. కానీ తీర్పు పాఠం చదివి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి శబరిమల ఆలయంలో భక్తుల ప్రవేశం ఉన్న నేపథ్యంలో విజయ్ స్పందించారు. మహిళల ప్రవేశంతోపాటు ముస్లిం, పర్షి మహిళల ప్రవేశంపై కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. శబరిమల ఆలయంలోకి రుతుక్రమం అయ్యే మహిళలప నిషేధం అమల్లో ఉంది. కానీ 2018లో సర్వోన్నత న్యాయస్థానం మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ.. సంచలన తీర్పునిచ్చింది. దీనిని హిందుసంస్థలు, సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పలు పిటిషన్లు దాఖలు కాగా.. గురువారం తీర్పు వెలువరించింది.
తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా ?… : బాలకృష్ణ