telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ సర్కార్ లో మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే.

హైదరాబాద్ – రేవంత్ రెడ్డి సర్కార్ లో నేడు 11 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.. వారందరికీ ముఖ్యమంత్రి రేవంత్ శాఖలను కేటాయించారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు..

ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్న భట్టి విక్రమార్కకు కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు.. ఇక హోం మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు.. కోమటిరెడ్డికి మునిసిపల్, దుద్దిళ్లకు ఆర్దికం, పొంగులేటికి నీటిపారుదల, కొండా సురేఖకు మహిళా సంక్షేమం శాఖలు లబించాయి..ఇక దామోదర రాజనరసింహ వైద్య, ఆరోగ్యం, జూపల్లి కృష్ణారావుకి పౌరసరఫరాలు, సీతక్కకు గిరిజన సంక్షేమం, తుమ్మలకు రోడ్డు భవనాలు, పొన్నంకు బిసి సంక్షేమ శాఖలు కేటాయించారు..

భట్టి విక్రమార్క – రెవెన్యూ శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి హోం మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – మునిసిపల్, పరిపాలనా శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్ బాబు – ఆర్ధిక శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి – నీటి పారుదల శాఖ మంత్రి
కొండా సురేఖ – మహిళా సంక్షేమ శాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ -మెడికల్ అండ్ హెల్త్ శాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు – పౌర సరఫరాల శాఖ మంత్రి
సీతక్క – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
తుమ్మల నాగేశ్వరరావు, – రోడ్లు భవనాల శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమ శాఖ మంత్రి

Related posts