telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణకి స్పీడ్ బోట్స్ పంపిస్తున్న జగన్…

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వేషాల కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని సాయం కోరారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో సహాయక చర్యల కోసం స్పీడ్ బోట్స్ పంపించాలని ఈరోజు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణా ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ వినతికి వెంటనే స్పందించిన జగన్. తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏపీ సీఎంవో ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె తెలుగు రాష్ట్రాలకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ పలుచోట్ల వచ్చే రెండు రోజులు భారీ వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

Related posts