telugu navyamedia
రాజకీయ వార్తలు

యాప్ ల విషయంలో భారత్ ను తప్పుబట్టిన చైనా

india-china-meating

సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్ళెం వేసేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకొంది. డ్రాగన్ కంట్రీ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. డ్రాగన్ కంట్రీ ఆర్థిక వనరులను దెబ్బతీసేలా ఆ దేశ యాప్ లను నిషేధిస్తోంది. పబ్జీగేమ్ సహా ఆ దేశానికి చెందిన 118 యాప్ లను నిన్న భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే.

భారత్ తీసుకున్న ఈ చర్యపై చైనా మండిపడింది. యాప్ ల నిషేదం విషయంలో భారత్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు చైనా సర్వీస్ ప్రొవైడర్ల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ దేశ వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ అన్నారు. తన తప్పులను భారత్ సరిదిద్దుకోవాలని చెప్పారు. భారత్ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Related posts