telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వల్ల దెబ్బతిన్న రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలి: చంద్రబాబు

chandrababu tdp ap

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. కరోనా బాధిత కుటుంబాల తో చంద్రబాబు ఆన్‌లైన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల దెబ్బతిన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ప్రతి పేద కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్ కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో రోజుకు 10 వేలకు మందికి పైగా కేసులు నమోదవుతున్నాయన్నారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాలు కరోనా బారిన పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం కరోనాను నియంత్రణ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. వనరుల వినియోగంపై దృష్టి లేదని ధ్వజమెత్తారు. పద్ధతి ప్రకారం చేస్తేనే కరోనాను నియంత్రించగలమని హితవు పలికారు. సంక్షోభం ఎప్పుడు వచ్చినా ఆదుకునేందుకు టీడీపీ ముందుంటుందని పేర్కొన్నారు.

Related posts