telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సికింద్రాబాద్ లో దారుణం.. ఉరేసుకొని భార్యభర్తల ఆత్మహత్య

Hang

సికింద్రాబాద్‌లో భార్యభర్తలు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. అంబర్ నగర్‌లో నివాసముంటున్న వెంకటేష్, భార్గవి దంపతులు గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య కు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

మెదక్ జిల్లాకు చెందిన వెంకటేష్‌కు భార్గవి అనే మహిళతో ఎనిమి దేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటేశ్‌ విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తుండగా, భార్గవి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నది. ప్రస్తుతం వీరు చిలకలగూడ పరిధిలోని అంబర్ నగర్‌లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించగా, భార్గవి బాత్రూమ్‌ కిటికీకి ఉరేసుకుంది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts