telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

3వ రోజుకు చేరిన.. హజారే దీక్ష..

anna hajare again protest for lokpal bill

ఎన్నికల వేడిలో ఒక స్వాతంత్ర పోరాటయోధుడి గోడు పట్టించుకోవడం కష్టమే మన రాజకీయనాయకులకు. అందుకే ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హాజారే చేస్తున్న నిరసన దీక్ష కొనసాగుతుంది, తప్ప ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 80ఏళ్ళు పైబడిన ఒక వృద్ధుడు దేశం కోసం చేసే దీక్ష చూసైనా యువతలో మార్పు వచ్చి, ప్రభుత్వం చేత పని చేయించుకోవడమైనా నేర్చుకోవాలి లేదా వారే ప్రభుత్వం ఏర్పాటు చేసి దేశాన్ని అభివృద్ధి చేయాలి. కానీ, ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి సామజిక కార్యకర్తలు కాలగతిలో కలిసిపోయినా చూస్తూ ఊరుకుంటున్నారే తప్ప, జరిగే ప్రయోజనాలు ఏమి కనిపించడంలేదు. ఆ విషయం ఈ ముసలి కార్యకర్తకు ఎప్పటికి తెలుస్తుందో.. అమాయకుడు. అయినా గాంధేయవాది వాది కదా, తట్టుకుంటాడు.. ఎప్పుడో విజయాన్ని కూడా (మా తరుపునుండి ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నాము) పొందుతాడు. లోక్‌పాల్‌, లోకాయుక్తాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో అన్నా హాజారే గడిచిన బుధవారం నాడు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

దీనికి తోడు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను, పలు ఎన్నికల సంస్కరణలను ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీక్ష నేటితో మూడవ రోజుకు చేరింది. నిరశన దీక్ష కారణంగా 81 ఏళ్ల అన్నా శరీరంలో రక్తపోటు, చక్కెర స్థాయిలు గణనీయంగా పెరిగనట్లు వైద్యులు పేర్కొన్నారు.

Related posts