telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

దేశంలో పంట పెట్టుబడి ఇస్తున్నది కేసీఆర్ మాత్రమే: హరీష్‌రావు

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ రెండోరోజు పర్యటించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో హరీష్‌రావు పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. వడ్డీలేని రుణాలు రూరల్ పరిధిలోని 19 గ్రామాలకు 4.80 కోట్లు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలను బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ రుణాలు ఇస్తున్నారు. మొత్తంగా రూ. 20 కోట్లు హుజురాబాద్ మహిళలకు అందిస్తున్నాము. అందరు ఎమ్మెల్యేలు మహిళా భవనం కట్టిస్తే హుజురాబాద్ లో ఎందుకు రాలేదు. రూ. 3 కోట్ల 10 లక్షల తో 16 గ్రామాలకు మహిళ సమైక్య భవనాల కోసం మంజూరు చేస్తున్నా. 3 నెలల్లో అన్ని గ్రామాల్లో మహిళల భవనాలు పూర్తి చేస్తాం అన్నారు.

అభయ హస్తం పింఛన్ డబ్బులు వాపస్ ఇవ్వాలని చెప్పాం. వడ్డీతో సహా చెల్లించడంతో పాటు అసరా పింఛన్ ఇస్తామన్నారు.
24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు కేసీఆర్. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ కాలడం లేదు. దేశంలో పంట పెట్టుబడి ఇస్తున్నది ఒక కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ఐకేపీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సీసీ ప్లేట్ ఫామ్ లు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఇస్తే ఎట్లా బతుకుతారు…మీకు కరెంట్ ఎక్కడిది అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఆయన జీవితం చీకటైంది. బీజేపీ రెండు వేల పింఛన్ ఎక్కడ ఇస్తుందో చెప్పాలి. 43 వేల మందికి హుజురాబాద్ లో పింఛన్లు వస్తాయి. అర్హులందరికి పింఛన్ ఇస్తాం. ఈటల రాజేందర్ కల్యాణ లక్ష్మీ, రైతు బంధు దండగ అన్నారు. ఒక వ్యక్తి ఆత్మగౌరవం ప్రజల ఆత్మగౌరవంతో ముడి పెడితే కుదరదు. ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ రైతు బంధు, ఆసరా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ కు 4 వేల ఇళ్ళు ఇచ్చారు. నేను సిద్ధిపేట లో ఇళ్లు పూర్తి చేశాం. ఈటెల శ్రద్ద పెట్టలేదు. ఒక్క ఇల్లు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.

Related posts