ఏపీలో మద్యం దుకాణాలను నిన్న తెరచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవద్దని నిన్న కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేశారని అన్నారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయని అన్నారు.
రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆరుగురు చనిపోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో క్రమశిక్షణగా ఉండి మనల్ని మనం కాపాడుకోవాలని అన్నారు.