నల్లగొండ జిల్లా హాలియా సీఎం కేసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మరోవైపు సీఎం సభను అడ్డుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేసిఆర్ గారి పర్యటన వివరాలు:
👉ఉదయం 11:35 కు ప్రగతి భవన్ నుండి బయలుదేరుతారు.
👉ఉదయం11:45 బేగంపేట నుండి హెలికాప్టర్ లో బయలు దేరుతారు.
👉 మధ్యాహ్నం12:30 నందికొండ చేరుకుంటారు అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా నెల్లికల్ కు బయలుదేరు తారు.
👉 మధ్యాహ్నం 12:45 నెళ్ళికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేస్తారు.
👉 మధ్యాహ్నం 1:00 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గుత్తా సుఖేందర్ రెడ్డి గారి నివాసాన్ని చేరుకుంటారు అక్కడే ఉమ్మడి నల్గొండ జిల్లా TRS నాయకులతో భోజనం.
👉 మధ్యాహ్నం 3:10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హాలియా మండలం లో పాలెం గ్రామం చేరుకుంటారు.
బహిరంగ సభ లో పాల్గొంటారు… సభ అనంతరం హైదరబాద్ కు బయలుదేరుతారు.