telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఫలించిన బీజేపీ వ్యూహం.. డిప్యూటీ సీఎంగా దుష్యంత్!

jjp supporting bjp in haryana

బీజేపీ హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-జేజేపీ మధ్య సయోధ్య కుదిరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. భాజపాకు సీఎం, జేజేపీకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం అమిత్​ షా ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన చేశారు. జేజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు.

జేజేపీ నేత దుష్యంత్​ చౌతాలా… అమిత్​ షాతో భేటీలలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. జేజేపీ డిమాండ్లకు అమిత్​ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దుష్యంత్​కు డిప్యూటీ సీఎం పదవి దాదాపు ఖాయమైందని సమాచారం. ఏదిఏమైనా కర్ణాటకలో జేడీఎస్ కి దక్కిన లక్కు ఇప్పుడు జేజేపీ కి చిక్కింది. భవిష్యత్తులో సీఎం స్థాయి అంశాలపైనా ప్రభావం ఉండనుందని నిపుణుల అభిప్రాయం.

Related posts