telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పాఠశాలలకు .. ఇక శనివారం .. నో బ్యాగ్ డే… : ఏపీసీఎం

every saturday is no bag day to schools

ఏపీసీఎం జగన్ ప్రమాణ స్వీకారం నాటి నుండి మంచి చేయడానికి, మార్పు తేవడానికి రాజకీయాలలోకి వచ్చినట్టు ప్రజలకు సంకేతాలు పంపారు. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. అతడి దూకుడుకు గత ప్రభుత్వం లో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులు,నాయకులు తమ తప్పులు ఎక్కడ బయటపడతాయో అని భయపడుతున్నారు.ప్రస్తుతం జగన్ తల్లితండ్రుల డబ్బులను దోచుకుంటూ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలు కు తన నిర్ణయం ద్వారా చెక్ పడనున్నది

జగన్, పిల్లలకు చదువు ఒక్కటే ముఖ్యం అని అటు తల్లిదండ్రులను ఇటు సమాజాన్ని చాలా రోజుల నుండి మోసం చేస్తున్న ప్రైవేట్ సంస్థలకు ఒక షాక్ ఇచ్చాడు. ఇక నుండి శనివారం నో బ్యాగ్ డే అని ఉతర్వలు జారీ చేశారు.ఇది పిల్లల మానసిక వికాసానికి ఉపయోగపడుతుందిని విశ్లేషకులు అంటున్నారు. శనివారం నో బ్యాగ్ డే అయితే ఇప్పటివరకు పిల్లలకు చదువు తప్ప మరేమీ అవసరం లేదు అని ప్రచారం చేస్తూ డబ్బులు వెనక వేసుకున్న ప్రైవేట్ సంస్థలకు ఇక పై విద్యార్ధులు తగ్గే అవకాశం ఉంది.పిల్లలు చదివినా చదవకపోయినా స్కూల్ కి పంపే తల్లిదండ్రులు వారి పిల్లలను వారి ఇష్టపడే రంగం వైపుగా పంపే అవకాశం ఉంది.దీనితో గతం లో తెలంగాణ ఇంటర్ ఫలితాల వల్ల జరిగిన మైనర్ సూసైడ్ లను అప్పవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

Related posts