telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మోదీ సభకు పవన్ దేరం..కార‌ణం ఇదేనా?

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంద్రప్రదేశ్‌లో పర్యటించారు. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్ర‌ధాని మోదీ పాల్గొన్నారు.

బీజేపీకి మిత్రపక్షమైన జనసేన కానీ ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కాని హాజరు కాలేదు. ఈ స‌భ‌కు జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ డుమ్మాకొట్టారు..

చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి రావల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. అయితే చిరంజీవి మాత్ర‌మే హాజ‌రై త‌మ్ముడు ప‌వ‌న్ రాక‌పోవ‌డంపై చ‌ర్చ నడుస్తోంది.

రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు పెద్దగా సంబంధాలు లేవు కానీ ఢిల్లీ బీజేపీ నేతలతో మాత్రం సాన్నిహిత్యం ఉందని పవన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. మోదీ వచ్చిన సందర్భంగా పవన్ భీమవరానికి వెళతారని అందరూ భావించారు.

ఎందుకంటే గత ఎన్నికలలో భీమవరం నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా మోదీ వేదిక పంచుకోకుండా ఎందుకు రాకుండా ఉన్నారు? బీజేపీ తో తెగ‌దెంపులు చేసుకోవాల‌ని భావిస్తున్నారా ? అందులో భాగంగానే మోదీ సభకు దూరంగా ఉన్నార‌న్న దానిపై రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఇక ఆహ్వానానికి సంబంధించి ప‌వ‌న్ ముందురోజే స్పందించారు. అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ‌స్తున్న ప్ర‌ధాన‌మంతి మోడీకి జ‌న‌సేన త‌రుపున స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌త్యేకంగా ఆహ్వానం పంపిన కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మోదీ గారికి తెలుగు ప్ర‌జ‌లు త‌రుపున‌, ఏపీ ప్ర‌జ‌లు త‌రుపున ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. 

Related posts