telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అందుకే రాజధానిని పులివెందులకు మార్చండి: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

pawan-kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని వ్యంగాస్త్రాలు సంధించారు. వైసీపీ సర్కార్ పై విమర్శల దాడికి మరింత పదునుపెట్టారు. విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ఇప్పటివరకు వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన పవన్ ఈసారి సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే, పులివెందుల నుంచి కర్నూలు వెళ్లిరావడం ఎంతో సులభం అవుతుందన్నారు. అందుకే రాజధానిని పులివెందులకు మార్చుకోవాలని సెటైర్ వేశారు. తద్వారా జగన్ కు ఖర్చు కూడా మరింత ఆదా అవుతుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తొలగింపు జీవో ఇచ్చిన వారిని తొలగించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ జీవోపై వెల్లువెత్తుతున్న విమర్శలు చూసి సీఎం జగన్ ఆ జీవో సంగతి తనకు తెలియదంటున్నారని పవన్ ఆరోపించారు.

Related posts