telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రధాని మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు… ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. ఇటీవ‌ల కురిసిన‌ భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని, త‌క్ష‌ణ సాయంగా రూ. వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు.

అంతేకాకుండా…ఏపీలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎంటీసీ బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. .భారీవర్షాల వల్ల 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం లేఖలో పేర్కొన్నారు.

నాలుగు జిల్లాలైన కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అసాధారణంగా 255 శాతం మేర అధిక వర్షపాతం నమోదైందన్న సీఎం.. తిరుపతి, తిరుమలలో వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగినట్లు తెలిపారు. నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలోని పలు ప్రాంతాలు నీటమునిగినట్లు లేఖ లో వెల్లడించిన సీఎం.. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేశారు.

మొత్తం 196 మండలాలు నీటమునిగినట్లు పేర్కొన్న సీఎం జగన్.. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లేఖలో తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో రహదారులు, చెరువులు, కోతకు గురైనట్లు పేర్కొన్న సీఎం.. చెరువులకు గండ్లు పడటంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయని లేఖలో పేర్కొన్నారు.

Related posts