ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెదవి విరిచారు. ఈరోజు అమరావతిలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేవలం జలయజ్ఞం గురించే గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే గుర్తుచేశారు.
ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల అయిన రాజధాని అమరావతిపై నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని బాలయ్య తెలిపారు. ఏపీలోని చేతివృత్తుల గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనలపై ప్రజలంతా ఆలోచిస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు.