అమరావతి: ఏపీ రాష్ట్రంలోని సీఎం జగన్ శనివారం కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రెండు వేల రూపాయల వంతున సాయం అందించాలన్నారు.
ఇప్పటికే వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకుని రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కడప నుంచి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులతో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరుతో పాటు భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్, అధికారులతో కలిసి పరిశీలిస్తున్నారు.