మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల భీమవరంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలు..చీరంజీవి కూడా హాజరయ్యారు. ఈ వేడుకలుల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మోదీ ప్రసంగం ముగిసిన అనంతరం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోదీకి చిరంజీవి శాలువతో సన్మానించారు. ఆత్మీయంగా చిరంజీవి భుజంపై చేతుల వేసి మోదీ కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ సభకు ప్రత్యేకంగా వచ్చిన చిరంజీవికి వేదికపై చోటు కల్పించారు. సభ ప్రారంభానికి ముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ చిరంజీవిని ప్రత్యేకంగా మోదీకి పరిచయం చేశారు.
కాగా..టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీనటులున్న చిరంజీవికి అల్లూరి జయంతికి ఆహ్వానం పంపడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకొత్తిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో చిరు వర్గానికి చెందిన కాపు ఓట్లను బీజేపీ వైపు ఆకర్షితులయ్యేలా చేయడంలో భాగంగానే చిరుకు ప్రత్యేక ఆహ్వానం అందించినట్టు తెలుస్తోంది.
మోదీ సభలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పరిణామం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీడీపీ ఎంపీల వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు!