ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయవాడ లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేతకేశినేని నాని సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ల భేటీ పై సోషల్ మీడియాలో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి సీఎం జగన్, ఆయనకు దేవుడిచ్చిన స్నేహితుడు కేసీఆర్ చొరవ తీసుకోవడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కేశినేని నాని తెలిపారు.
అయితే ఈ సమస్యలను తెలంగాణకు లబ్ధి చేకూర్చేలా పరిష్కరిస్తారా? లేదంటే ఏపీకి సంబంధించిన పెండింగ్‌లో ఉన్నవాటిని సాధిస్తున్నారా? అసలేం జరుగుతోందన్నట్లుగా కేశినేని ఫేస్‌బుక్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు.
అప్పలనాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదు: రోజా