మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ శిందే బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకున్నారు
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం షిండే నెగ్గారు.ఆయనకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు, బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. .
శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా 164 ఎమ్మెల మద్దతు లభించింది. విశ్వాస పరీక్షలో ప్రతిపక్షానికి 99 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు.
ఇక ..అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మహారాష్ట్ర నూతన స్పీకర్‌గా ఆదివారం బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ ఎన్నికైయ్యారు . ఎంవీఏ తరుఫున పోటీ చేసిన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ ఓడిపోయారు.
రాహుల్ నార్వేకర్ 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి
జూన్30న ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎంగా భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, శివసేన చీఫ్ విప్‌గా ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించారు. అయితే, ఈ నిర్ణయంపై ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసం తెలిపింది.
బలనిరూపణ వెనుక బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: కుమారస్వామి