telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోడీ ఇంత తెలివి కలిగినోడని అనుకోలేదు : వీహెచ్‌

ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఎకనమిక్‌ సర్వేను విడుదల చేసింది ప్రభుత్వం. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ని సభలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 15 వరకు తొలి విడత సమావేశాలు జరుగుతాయి. తర్వాత 20 రోజుల విరామం ఉంటుంది. తిరిగి మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకూ పార్లమెంట్‌ రెండో విడత సమావేశాలు జరుగుతాయి. అయితే…కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు బైకట్ చేస్తే…టీఆర్‌ఎస్‌ ఎందుకు హాజరైంది..? అని ప్రశ్నించారు. రైతుల ఉద్యమం నీరు గార్చేందుకు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికిందని ఫైర్‌ అయ్యారు. రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చి..రైతులను రెచ్చగొట్టారని.. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే పద్దతి మోడీకే దక్కిందని మండిపడ్డారు. దీప్ సిద్దూ అసలు రైతుల ర్యాలీకి ఎందుకు వెళ్ళాడు..? అని జాతీయ జెండాను పక్కకు పెట్టి సిక్కు జెండా ఎట్లా ఎగిరేశారని నిలదీశారు. మోడీ ఇంత తెలివి కలిగినోడు అని అనుకోలేదని… రైతుల ర్యాలీకి అనుమతి ఇవ్వడం… గొడవ సృష్టించడం మోడీకే సాధ్యం అయిందని ఫైర్‌ అయ్యారు వీహెచ్‌.

Related posts