telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

షాకింగ్‌ : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

gold-biscuits hyd

కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రికార్ఢ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 55,030 కు పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 50, 450 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో రూ. 52,370కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరగడంతో రూ.48,010 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.64,500కు చేరింది. బంగారం ధర కొంచెం పెరిగితే…వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నట్లు ప్రముఖలు చెబుతున్నారు.

Related posts