telugu navyamedia
రాజకీయ

కాంగ్రెస్​ నేతలకు షాకిచ్చిన స్మృతీ ఇరానీ.. లీగల్​ నోటీసులు

తన కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్‌ నడుపుతున్నట్లుకాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నోటీసులు పంపడంతో.. ఈ వివాదం వేరే లెవల్‌కి వెళ్లింది.

తన కుమార్తెపై చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని.. ఈ క్రమంలోనే బేషరతుగా రాతపూర్వక క్షమాపణలు చెప్పాలంటూ ముగ్గురు నేతలకు, కాంగ్రెస్‌ పార్టీకి లీగల్ నోటీసు పంపారు. ఇందులో పవన్ ఖేడా, జైరాం రమేష్, నెట్టా డిసౌజాలు ఉన్నారు.

మంత్రిగా, ప్రజాజీవితంలోని వ్యక్తిగా ఉన్న మా క్లయింట్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు, ఆమెతోపాటు ఆమె కుమార్తెను అగౌరవపరిచేందుకు తప్పుడు ఆరోపణలు చేశారు’ అని నోటీసులో పేర్కొన్నారు. మంత్రి కుమార్తెకు గోవాలో బార్‌ నిర్వహణలో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాగా, స్మృతి కుమార్తె నడుపుతున్న రెస్టారెంట్‌ లైసెన్స్‌ను గత ఏడాది మే నెలలో మృతి చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఈ ఏడాది జూన్‌లోలో తీసుకున్నారు. గత 13 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద లైసెన్స్‌ ఎలా తీసుకుంటారన్నది తలెత్తుతున్న ప్రశ్న. ఇది ముమ్మాటికి అక్రమమే అని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్‌కు ఒక బార్‌ లైసెన్స్‌ మాత్రమే ఉండాలి. ఎక్కవుగా ఉండేందుకు అవకాశం ఉండదు. కానీ.. సిల్లీ సోల్స్‌ గోవా రెస్టారెంట్‌ పేరిట రెండు బార్‌ లైసెన్సులున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

స్మృతి ఇరానీ ప్రమేయం లేకుండానే ఆమె కూతురు లైసెన్స్‌ పొందడం సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు. వెంటనే ప్రధాని మోదీ స్పందించి కేంద్రమంత్రిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. అయితే, ఈ అంశం దుమారం రేగడంతో స్మృతి ఇరానీ స్పందించారు.

తన కూతురు స్టూడెంట్‌ అనీ, 18 సంవత్సరాల యువతి గౌరవాన్ని దిగజార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ అమ్మాయి తల్లి 2014, 2019లో రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేయడం. సోనియా, రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టడమే అంటూ ఘాటుగా స్పందించారు స్మృతీ ఇరానీ. ఈ తప్పుడు ఆరోపణలపై కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. ఈ మేరకు తాజాగా లీగల్‌ నోటీసులు పంపారు.

Related posts