అమెరికా-చైనా లకు ఎప్పుడు ఎప్పుడు పడద్దు. మరి ముఖ్యంగా చైనా నుండే కరోనా రావడంతో చైనా చర్యలపై ఎప్పుడు అమెరికా మండిపడుతోంది. సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. భాగస్వామ్య మిత్రపక్షాలకు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిదారిగా చైనా గురించి మాట్లాడారు. గతంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా చైనాపై పెద్ద యుద్ధమే చేశారు. కరోనా వైరస్ ను చైనా వైరస్ గా అభివర్ణించారు. చైనా కంపెనీలు, సంస్థలపై అనేక ఆంక్షలు విధించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా చైనా విషయంలో ట్రంప్ బాటలో నడిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇండియా చైనా మధ్య సరిహద్దుల్లో వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఒకవైపు చర్చలు అంటూనే చైనా సైన్యం బోర్డర్లో సరిహద్దుల్లో రెచ్చిపోతున్నది. దీంతో భారత సైన్యం సరిహద్దుల్లో నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. ఇటీవలే సరిహద్దుల్లో సైన్యాన్ని మరింత బలోపేతం చేసినట్టుగా రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాల ప్రసంగంలో పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
సుశాంత్ డ్రగ్స్ కోసం వేధించేవాడు… రియా సంచలన వ్యాఖ్యలు