telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అవగాహన లేనివారితో నేను మాట్లాడాను…

దేశ రాజధాని ఢిల్లీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఓ ఎలక్ట్రిసిటీ మోడల్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే దానిపై గోవా ఎలక్ట్రిసిటీ మంత్రి నీలేష్ కబ్రల్ సంచలన వ్యాక్యలు చేశారు. అది సరైనది కాదని, దాని వల్ల ఎటువంటి ప్రయోజనం రాదంటూ అన్నారు. అంతేకాకుండా అవసరమైతే దానిపై డిబేట్‌కు కూడా సిద్దమని అన్నారు. దాంతో ఢిల్లీ మంత్రి రాఘవ్ చడ్డా గోవాకు బయలుదెరారు. ఈ డిబేట్‌కు సంబంధించిన వివరాలను తెలుపాల్సి ఉందని చడ్డా అన్నారు. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఎలక్ట్రిసిటీ మోడల్‌పై గోవా మంత్రి సవాల్ చేశాడు. కావాలంటే డిబేట్‌కు కూడా సిద్దమాన్నారు. అయితే అతడి ఈ డిబేట్ పాల్గొంటాడని ఆశిస్తున్నాన’ని చడ్డా చెప్పారు. అంతేకాకుండా ఇటువంటి డిబేట్‌ల ద్వారా గోవా ప్రభుత్వం పరువు తీయవద్దంటూ గొవా ప్రభుత్వాన్ని చడ్డా మందలించారు. అయితే చడ్డా సోమవారం కాబ్రాల్‌ను డిబేట్‌కు ఛాలెంజ్ చేశారు. దాంతో సమస్యతో ఎటువంటి సంబంధంలేని వారితో డిబేట్ చేయాల్సిన అవసరం లేదని, సమస్యకు దగ్గరి వారితో మాట్లాడతానని కాబ్రాల్ తెలిపారు. ‘సరైన అధికారులతో మాట్లాడేందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వారికి సమస్యపై మంచి అవగాహన ఉంటుంది. అంతేకానీ ఎటువంటి సంబంధం, అవగాహన లేనివారితో నేను మాట్లాడన’ని కాబ్రాల్ తెలిపారు.

Related posts