telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ…!

Ram-Gopal-Varma

కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇచ్చారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ఆయన ట్విటర్లో ట్వీట్ పెట్టారు. ‘‘డియర్ వైరస్, బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూపోయే బదులు నువ్వు కూడా చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలుసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే. నా మాటపై నమ్మకం లేకపోతే వెంటనే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకో. కాబట్టి నీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్వు బతుకు, మమ్మల్ని బతకనివ్వు. నీకు కూడా జ్ఞానం ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను’ అని ట్వీ్ట్ చేసారు. మనం ఇంతకాలం ఎన్నో చైనీస్ వస్తువులను చాలానే ఉపయోగించాం. ఇప్పుడు చావు కూడా చైనాదేనా అని కామెంట్ చేసారు. ‘‘చివరికి మన చావు కూడా మేడ్ ఇన్ చైనా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు’’ అని హిలేరియస్ ట్వీట్ పెట్టారు. మొన్నటి వరకు చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపించిన కరోనా ఇప్పుడు ఇండియాకూ వచ్చేసింది. తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. అతన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు.

Related posts