telugu navyamedia
రాజకీయ సాంకేతిక

గాడిదను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్…ఎందుకో తెలిస్తే షాకే

The reporter interviewed the donkey

కరోనా కేసులు పెరుగుతున్నా జనాలు మాస్కు కూడా ధరించకుండా రోడ్లపై తిరుగుతుండంపై ఓ రిపోర్టర్ కి చిర్రెత్తుకొచ్చింది. ఎలాగైనా జనాలకు బుద్ధి చెప్పాలని అతడు చేసిన ప్రయత్నం వైరల్ గా మారింది. దేశంలో కరోనా ఉధృతి పెరిగింది.రోజుకు ఇరవై వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆరంభంలో ఒక్క కేసు కూడా నమోదు కానీ సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చిన ప్రభుత్వాలు ఆ తర్వాత చేతులెత్తేశాయి.

జనం అయితే మొదట్లో భయంతో బయటకు వచ్చేందుకు తెగ భయపడి పోయేవారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్లిప్తత ప్రజలకు కూడా అంటుకుంది. మొదట్లో ఒకటి నుంచి పదికి , ఆ తర్వాత వందలకు, ఇప్పుడు రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.అయినా ప్రజల్లో భయం ఉండడం లేదు. ఇప్పటికీ మాస్కు లేకుండా బయట తిరుగుతున్నారు. కూరగాయలు, మద్యం, చికెన్ షాపు వద్ద గుంపులుగా ఉంటున్నారు. ఇవన్నీ చూసి చాలామందికి పట్టరాని కోపం వస్తున్నా.. ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతున్నారు.

కానీ ఓ రిపోర్టర్ మాత్రం ఈ విషయంలో జనాన్ని కడిగేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా దారినపోయే ఓ గాడిదను ఆపి ‘మాస్కు ఎందుకు పెట్టుకోలేదు అంటూ’ ప్రశ్నించాడు. అది సమాధానం ఇవ్వకపోవడంతో తన చుట్టూ చేరిన జనాన్ని ఉద్దేశిస్తూ ‘గాడిద ఎందుకు సమాధానం ఇవ్వలేదు ‘ అంటూ ప్రశ్నించాడు. గాడిద మాస్కు పెట్టుకోకుండా రోడ్డుపై తిరుగుతోందని అందుకే సమాధానం ఇవ్వలేదని వారు అన్నారు. ఇంకా ఇలా చాలా మంది గాడిదలా మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారని, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆ రిపోర్టర్ ప్రజలకు హితబోధ చేశాడు. కరోనా కట్టడిలో ఆ రిపోర్టర్ చేసిన పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు.

Related posts